శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయం
శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయం
శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయం


అమరావతి, 03 ఆగస్టు (హి.స.)విశాఖ నగ రంలో ప్రత్యేకత కలిగిన టౌన్ సర్వే రిజర్వాయర్ (టీఎస్ఆర్) కాంప్లెక్స్ దుకాణ సముదాయం థిలావస్థకు చేరింది. ఒకప్పుడు నగరంలో లాండ్మార్క్గా వెలుగొందిన ఈ భవనం నిర్వహణలోపంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి చేరడంపై నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 40 ఏళ్ల కిందట టీఎస్ఆర్ కాంప్లెక్స్ పేరుతో 80 దుకాణాలు ఉండేలా జీవీఎంసీ జీ+1 భవన నిర్మాణాన్ని చేపట్టింది. అప్పట్లో విశాఖలో అతిపెద్ద షాపింగ్కాంప్లెక్స్ కావడంతో ప్రత్యేకగుర్తింపు పొందింది. ఎవరైనా తమవారిని లేదంటే స్నేహితులను కలవాలనుకుంటే టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్దకు రావాలి అని చెప్పుకునేవారు. అలాంటి షాపింగ్కాంప్లెక్స్లో దుకాణాల కోసం వ్యాపారులు పోటీపడేవారు. కాలక్రమేణా షాంపింగ్కాంప్లెక్స్ నిర్వహణపై జీవీఎంసీ నిర్లక్ష్యం వహించడంతో మరమ్మతులుచేసే పరిస్థితిలేకుండాపోయింది. శ్లాబ్ పెచ్చులు ఊడి పడిపోతుండడంతో ఏక్షణంలో కూలిపోతోందో అన్నట్టు మారింది. షాపింగ్ కాంప్లెక్స్లోని పైఅంతస్థులోని దుకాణాలన్నింటినీ వ్యాపారులు ఖాళీ చేసేశారు. ప్రస్తుతం జీవీఎంసీ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రం మాత్రమే నడుస్తోంది. టీఎస్ఆర్ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రైవేటు షాపింగ్ కాంప్లెక్స్లు పెరిగిపోవడంతో గ్రౌండ్ఫ్లోర్లోని దుకాణాలకు గిరాకీ తగ్గిపోయుంది. కొన్నేళ్లుగా కేవలం చెప్పుల దుకాణాలు మాత్రమే నడుస్తుండగా, కొన్ని ఖాళీగా ఉండిపోగా మరికొన్నింటిని వస్త్ర, జ్యువెలరీ, పండ్లరసాల వ్యాపారులు నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande