
ఆసిఫాబాద్, 03 ఆగస్టు (హి.స.)
మత్తుపదార్థాల వాడకం యువత
భవిష్యత్తును నాశనం చేస్తుందని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ యువ వికసిత్ భారత్' కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి పోరాదని సూచించారు. చదువే యువతకు నిజమైన నషా అని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. సమాజంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..