
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఒకవేళ బకాయిలు చెల్లించకపోతే మిలిటెంట్ పోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని అడిగితే తాను ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాను కాబట్టి ఏపీలో రీయింబర్స్ మెంట్ కోసం పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు.
ఇకపై మరో పోరాటం:
ఏపీలో బకాయిలు ఉన్నప్పటికీ అక్కడ స్కీమ్ చాలా బాగుందని ఏపీలో పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంటే తెలగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు, డిగ్రీకి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని ఇక్కడ కూడా ఏపీ తరహాలో పథకం తెలంగాణలో కూడా అమలు చేయాలని అన్నారు.య ఇకపై బకాయిల విడుదలతో పాటు ఏపీ తరహాలో ఎంత ఫీజు అంటే అంత చెల్లించేలా నిర్ణయం తీసుకునేందుకు పోరాటం చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..