
సిద్దిపేట, 03 ఆగస్టు (హి.స.)
ప్రజావాణి అర్జీల పెండింగ్ పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. దాదాపు 30 రోజుల్లోపు అర్జీలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఒక్క అర్జీకి వెయ్యి రూపాయల మేర ఫైన్ వేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని డీఈఓ, మండల విద్యాధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..