
హాలహర్వి, 03 ఆగస్టు (హి.స.)
: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు 40,705 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం డ్యాంలో 1,613.16 అడుగులకు గాను 44.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాలు కోసం వివిధ కాల్వలకు 1,390 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో డ్యాం పై ఆధారపడిన రైతులు ఆశలు చిగురిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ