రణరంగంగా ఏబీవీపీ స్టూడెంట్స్ మార్చ్.. పోలీసులకు,విద్యార్థులకు తీవ్ర వాగ్వాదం
రణరంగంగా ఏబీవీపీ స్టూడెంట్స్ మార్చ్.. పోలీసులకు,విద్యార్థులకు తీవ్ర వాగ్వాదం
High tension


హనుమకొండ, 03 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్టూడెంట్స్ మార్చ్ హనుమకొండలో రణరంగంగా మారింది.

కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఎన్డీఎల్సీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. అయితే, కేయూ ఎసీఎల్సీ నుంచి ప్రారంభమైన మార్చ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆగకుండా వరంగల్ కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది.

అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అక్కడే అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అస్వస్థతకు గురయ్యారు.

చివరికి పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కలెక్టరేట్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande