
కరీంనగర్, 03 ఆగస్టు (హి.స.)
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యారం, చెస్ పోటీలను ప్రారంభించి పోటీదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. న్యాయవాదులు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చంద్రపాటి కిరణ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బెజ్జంకి శ్రీకాంత్, క్యారం ఇన్చార్జిలు హర్జీత్ సింగ్, భరతం శేఖర్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..