తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.. పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ దివాకర టీఎస్
తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.. పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ దివాకర టీఎస్
Collector


ఖమ్మం, 03 ఆగస్టు (హి.స.)

ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ ఆహారమని తెలిపారు. శిశువు పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టించేలా ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఆరు నెలల కాలంలో శిశువు ఎదుగుదల, అభివృద్ధికి, రోగ నిరోధక శక్తికి అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాలలోనే లభిస్తాయని అన్నారు.ఎక్స్ క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం లేదా పానీయం ఇవ్వక పోవడమేనని తెలిపారు.

ఈ కాలంలో నీరు, పైపాలు, పాలపొడి లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల శిశువుకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, వైద్యుల సూచన లేకుండా పాల పొడి లేదా డబ్బా పాలను వినియోగించరాదని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి, ప్రాజెక్టు స్థాయి, అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తూ ప్రతి శిశువుకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande