సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి.నరసింహస్వామి ని దర్శించుకున్న విజయనగరం ఎంపీ.కలిశెట్టి. అప్పలనాయుడు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి.నరసింహస్వామి ని దర్శించుకున్న విజయనగరం ఎంపీ.కలిశెట్టి. అప్పలనాయుడు
simhachalam


విజయనగరం, 03 ఆగస్టు (హి.స.)

: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల కలగా ఎదురుచూసిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవంతంగా ప్రారంభమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందన్నారు. ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని వివరించారు. వలసలు తగ్గి, ప్రపంచ దృష్టి ఉపాధి కోసం ఉత్తరాంధ్ర వైపు ఎదురు చూస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఉత్తరాంధ్రలో వరుస అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande