ఆంధ్రప్రదేశ్ చేసేత జౌళి శాఖ మంత్రి.సవిత అధికారులతో. ఇవాళ సమీక్షసమావేశం
ఆంధ్రప్రదేశ్ చేసేత జౌళి శాఖ మంత్రి.సవిత అధికారులతో. ఇవాళ సమీక్షసమావేశం
ఆంధ్రప్రదేశ్ చేసేత జౌళి శాఖ మంత్రి.సవిత అధికారులతో. ఇవాళ సమీక్షసమావేశం


అమరావతి, 03 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలు, కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. 'నేతన్న సేవలో' పథకానికి అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గడువులోపు చేనేత కార్మికులందరూ దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని అందుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థికసాయాన్ని చేనేత కార్మికులకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా 'నేతన్న సేవలో' పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande