ప్రజావాణిలో 30 ఫిర్యాదులు స్వీకరించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
ప్రజావాణిలో 30 ఫిర్యాదులు స్వీకరించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
PolicePolice


నిజామాబాద్, 03 ఆగస్టు (హి.స.)

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 30 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కమిషనర్ స్వయంగా విన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్సాయి చైతన్య మాట్లాడుతూ.. ఎలాంటి మధ్యవర్తులు, పైరవీలు లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించి తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండటం, శాంతిభద్రతలను పరిరక్షించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 30 ఫిర్యాదులను అధికారులు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande