
సంగారెడ్డి, 03 ఆగస్టు (హి.స.)
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనుజాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.
శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించడం ద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత పై అవగాహన కల్పించే పోస్టర్ను సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలను శిశువుకు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. అవి శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయని, తల్లి-శిశువు మధ్య బంధం మరింత బలపడుతుందని అన్నారు. ఆరోగ్యవంత నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా & శిశు సంక్షేమ అధికారి లిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఆర్డీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..