సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై అభ్యంతరకర పోస్ట్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
Shikha Goyal


హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.) సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై (Shikha Goel) ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ అభ్యంతరకర పోస్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు నెటిజన్పై ఐటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande