
తిరుమల, 03 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. ఆదివారం 84,646 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,700 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.5 కోట్లు వచ్చింది. ఇదిలా ఉంటే తిరుమలకు భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు దర్శనానికి వస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లాంటి సౌత్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అధికారులు సైతం అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వసతులు ఇతర సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV