
శ్రీశైలం , 03 ఆగస్టు (హి.స.) : శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. స్వామి అమ్మవార్లను మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు స్పర్శ దశనానికి అనుమతి. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV