
తాడికొండ:, 03 ఆగస్టు (హి.స.)
గుంటూరు జిల్లా తాడికొండ మండల మోతడక, నిడుముక్కల గ్రామంలో రీ సర్వే ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా తాడికొండ తహసీల్దార్ సీతారామయ్య చేతుల మీదుగా రైతులకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రీ సర్వేలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సాంబశివరావు, వీఆర్వో జాన్ సైదా సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ