వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14రోజుల రిమాండ్.. కర్నూలు జైలుకు తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14రోజుల రిమాండ్.. కర్నూలు జైలుకు తరలింపు
ఎమ్మెల్యే విరూపాక్షికి


కర్నూలు , 03 ఆగస్టు (హి.స.) వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విరూపాక్షితో సహా మరో 15 మందికి రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కర్నూలు జైలుకు తరలించారు.

మరోవైపు విరూపాక్షి అరెస్ట్ పై ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్ సీసీ టీీవీ ఫుటేజ్ భద్రపర్చాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ తమ ముందు ఉంచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వీరూపాక్షి చిప్పగిరిలో శనివారం రాత్రి ఓ వ్యక్తిగత వివాదంలో తలదూర్చి, టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని అరెస్ట్ చేశారు. దాడుల్లో ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ విషయంలో విరూపాక్షి, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు అనుచరులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డారని కేసు నమోదైంది. దీంతో ఆదివారం రాత్రి పోలీసులు ఎమ్మెల్యేతో పాటు, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కోర్టులో హాజరుపర్చడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande