
తిరుపతి 03 ఆగస్టు (హి.స.) తిరుపతి రైతుబజార్లో ప్రజలకు తక్కువ ధరకు బియ్యం బస్తాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కౌంటర్ను ఈ రోజు సోమవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్,తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు కౌంటర్లో చేపట్టిన ఏర్పాట్లు,బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించి,ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV