నేడు పిడుగులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ
నేడు పిడుగులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ
Heavy rain with strong winds in Ahmedabad,


కర్నూలు, 03 ఆగస్టు (హి.స.) ఏపీ , తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి ప్రఖర్జైన్ తెలిపారు. సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలాంటి కూడా జారీ చేసింది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు APSDMA MD ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయన్నారు. మిగిలిన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించారు. కాగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో లంక గ్రామాల ప్రజలు వరద పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు ప్రఖర్ జైన్.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande