అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు...ముఖ్యమంత్రి.చంద్రబాబు
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు...ముఖ్యమంత్రి.చంద్రబాబు
Chandrababu Naidu(file)


అమరావతి, 04 ఆగస్టు (హి.స.)

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం) ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. అమరావతిలో వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీ గత డిసెంబర్లో ప్రారంభించామని వెల్లడించారు. 2028లో అమరావతి ఫేజ్ -1 ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీకి లైఫ్ లైన్ అని ఉద్ఘాటించారు. హెచ్ఆర్ వ్యయం నేటికి 98 శాతం అయిందని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని గణాంకాల గురించి అధికారులకు సీఎం వివరించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను తాను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande