పట్టుచీరవిలువ తగ్గించి రాశారని చైర్మన్.రాధాకృష్ణకు ఫిర్యాదు
పట్టుచీరవిలువ తగ్గించి రాశారని చైర్మన్.రాధాకృష్ణకు ఫిర్యాదు
durgamma


ఇంద్రకీలాద్రి,, 04 ఆగస్టు (హి.స.)

: ఆషాఢ సారెలో భాగంగా గొల్లపూడి నుంచి వచ్చిన ఆర్యవైశ్య బృందం సభ్యులు ఇచ్చిన పట్టుచీర విలువను కౌంటరులో తగ్గించి రాయడంపై దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణకు ఫిర్యాదు చేశారు. సారె బృందం రూ.18వేలు విలువ చేసే పట్టుచీరను దేవస్థానం కౌంటరులో ఇచ్చేందుకు వెళ్లారు. ఆ బిల్లు చూపించినప్పటికీ చీర ఖరీదును రూ.10వేలు మాత్రమే నమోదు చేయడంపై కౌంటరులో ఉద్యోగినిని వారు ప్రశ్నించారు. అదే చీరను అమ్మవారికి కట్టిన తర్వాత తాము తీసుకుంటామని అడగ్గా రూ.14 వేలు కట్టి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో వారు ఆశ్చర్యానికి గురై ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన చీరను తిరిగి తీసుకుంటామని వారు చెప్పడంతో చీరలు సేకరించే గుత్తేదారు అనుచరులు తమను బెదిరించారని వాపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande