
అమరావతి, 04 ఆగస్టు (హి.స.)
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల్లో మరింతగా వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల తాగునీటికి జల్ జీవన్తో భద్రత కల్పించాలని వెల్లడించారు. లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు వచ్చాయని తెలిపారు.
రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఆయా నిర్మాణాల పనులను వేగవంతం చేశామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 400 కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. నాణ్యత ప్రమాణాలను స్వయంగా తాను పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ