వైసిపి పై బోరుగడ్డ అనిల్ రివర్స్ ఎటాక్
వైసిపి పై బోరుగడ్డ అనిల్ రివర్స్ ఎటాక్
వైసిపి పై బోరుగడ్డ అనిల్ రివర్స్ ఎటాక్


తాడేపల్లి,, 04 ఆగస్టు (హి.స.)

:వైసీపీపై బోరుగడ్డ అనిల్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ నిరసనకు దిగారు. భార్యతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన.. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. వైసీపీ ఆఫీసుకు రావొద్దంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనెవరో తెలియదని సజ్జల అనడం విచిత్రంగా ఉంది. నాకు, నా కుటుంబానికి సజ్జల బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు.

ప్రాణ త్యాగానికైనా సిద్ధం..

‘నన్ను రౌడీషీటర్ అన్న కారుమూరి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. బొడ్డు శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డా. 9 నెలలు జైల్లో ఉన్న. నా పైన 22 కేసులు ఉన్నాయి. నేను పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. నా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. నా సాఫ్టవేర్ కంపెనీలు మూతబడ్డాయ్. నాకు అవమానం జరిగింది. జగన్ పీఏకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. నా పార్టీ వాళ్లే నన్ను రౌడీషీటర్ అని అంటూ ఉంటే నా కుటుంబ సభ్యులు, నా చెల్లెలు మానసికంగా చాలా బాధపడుతున్నారు’ అంటూ బోరుగడ్డ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande