సీఎంఆర్పై మంత్రి ఉత్తమ్ ఫోకస్.. డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు
తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.
Uttam


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్ వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక సంస్కరణలపై చర్చించారు. గత 10-12 ఏళ్లుగా సీఎంఆర్లో జరిగిన వ్యవహారాలపై లోతుగా పరిశీలన చేపట్టారు. ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

ఇప్పటివరకు నిర్వహించిన విజిలెన్స్ దాడులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల పనితీరు, సీఎంఆర్ బకాయిల పరిస్థితి, డిఫాల్ట్ల వివరాలపై అధికారులు నివేదికలు సమర్పించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు కొత్త వ్యూహాలను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, లీగల్ విభాగాల ఉన్నతాధికారులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రభుత్వ నిధుల రక్షణే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande