
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి
ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. హస్తినాపురం, ఉప్పల్, సరూర్ నగర్, చార్మినార్, హయత్ నగర్, గోల్కొండ, నాంపల్లి, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ఇళ్లల్లోకి కూడా నీళ్లు చేరాయి. దీంతో అర్ధరాత్రి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
సరూర్ నగర్ లో అత్యధికంగా 112 MM వర్షం కురిసింది. ఉప్పల్ ప్రాంతంలో 81.3 MM, బండ్లగూడ 79.5 MM హయత్ నగర్ 72.5 MM వర్షపాతం నమోదయింది. ఇటు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. ఉదయం వరకు ఈ పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అటు నిన్న సరూర్ నగర్ లో అత్యధికంగా 112 MM వర్షం కురిసింది. ఉప్పల్ ప్రాంతంలో 81.3 MM, బండ్లగూడ 79.5 హయత్ నగర్ 72.5% వర్షపాతం నమోదయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు