
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) నగరంలోని సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఐడీ ప్రూఫ్ అడిగినందుకు హోటల్ సిబ్బందిపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆకాశ్ అనే క్లీనింగ్ స్టాఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భరత్నగర్లోని ఓ హోటల్కు అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు వచ్చారు. రూమ్ ఇవ్వాలని కోరగా.. హోటల్ సిబ్బంది ఐడీ ప్రూఫ్ అడిగారు. ‘మేము లోకల్.. ఐడీ ఎందుకు’ అంటూ సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఆధార్ కార్డు అడగడంతో మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
రూమ్ బుకింగ్ కోసం వచ్చిన వ్యక్తులు కర్రలతో హోటల్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో క్లీనింగ్ స్టాఫ్ ఆకాశ్కు తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారంపై సనత్నగర్ పోలీస్స్టేషన్లో హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నలుగురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్