
రాయచోటి, 04 ఆగస్టు (హి.స.): అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన మంత్రి గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV