తిరుమలలో తగ్గని రద్దీ.. శ్రీవారి దర్శనానికై గంటల తరబడి నిరీక్షణ!
తిరుమలలో తగ్గని రద్దీ.. శ్రీవారి దర్శనానికై గంటల తరబడి నిరీక్షణ!
తిరుమల


తిరుమల, 04 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఉదయం 8 గంటల తర్వాత స్వామివారి సర్వదర్శనానికి ఎలాంటి టోకెన్లు లేకుండా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఇక నిన్న (సోమవారం) స్వామివారిని 78,561 మంది భక్తులు దర్శించుకోగా.. 33,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు సమకూరింది. 3.85 లక్షల లడ్డూలను కౌంటర్లలో విక్రయించారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం సహా.. 2.06 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande