లైంగిక దాడి ఆరోపణలు.. హైకోర్టులో రేగా కాంతారావు పిటిషన్
లైంగిక దాడి ఆరోపణలు.. హైకోర్టులో రేగా కాంతారావు పిటిషన్
ts highcourt


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక దాడి, మోసం ఆరోపణలతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో అభ్యర్థించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని, టీవీ ఛానల్ ఏర్పాటుకు సహకరిస్తానని నమ్మించి రేగా కాంతారావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, తన వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, ఈ ఆరోపణలను రేగా కాంతారావు తన పిటిషన్‌లో తోసిపుచ్చారు. రాజకీయ, వ్యక్తిగత కారణాలతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తప్పుడు కేసు బనాయించారని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న ఘటనలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమని, అందువల్ల ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు.

ఈ పిటిషన్‌ ఆగస్టు 5వ తేదీన జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande