
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ పరిధిలోని చందానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు ఉదయం ధృవీకరించారు పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు దుకాణం వెనుక వైపు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి, ఆ రంధ్రం ద్వారా లోపలికి చొరబడ్డారు
లాకర్‌ను పగులగొట్టి సుమారు 7 తులాల బంగారం మరియు 4 కేజీల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.
అంతర్రాష్ట్ర ముఠాల కదలికలు:
నగరంపై ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నిఘా పెట్టినట్లు సైబర్ క్రైమ్ మరియు లోకల్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఈ ముఠాలు పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.
పోలీసుల యాక్షన్ ప్లాన్:
ఈ భారీ చోరీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సిటీవ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నైట్ పెట్రోలింగ్‌ను (రాత్రి గస్తీ) మరింత కట్టుదిట్టం చేశారు . అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi