రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ది మిత్ర కిట్లు దాదాపుగా పూర్తి
రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ది మిత్ర కిట్లు దాదాపుగా పూర్తి
రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ది మిత్ర కిట్లు దాదాపుగా పూర్తి


అమరావతి, 05 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. మొత్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు 99.75 శాతం వరకు కిట్లను అందజేశారు. నోట్ పుస్తకాలు, బెల్టులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, పిక్టోరియల్ డిక్షనరీల పంపిణీ వంద శాతం పూర్తి కాగా, యూనిఫాం క్లాత్ పంపిణీ 99.86 శాతం, బూట్లు 98.46 శాతం, బ్యాగులు 99.68 శాతం పంపిణీ జరిగింది. మిగతా పంపిణీ కూడా త్వరలోనే పూర్తి అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. బడులు తెరిచిన జూన్ 12 నుంచి విద్యార్థి కిట్ల పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది యుద్ధం కారణంగా కిట్ వస్తువుల తయారీలో జాప్యం ఏర్పడింది. ముడిసరుకు రవాణాలో అంతరాయం ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande