
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)
రాజధాని అమరావతి పరిధిలో మౌలిక వసతుల కల్పన మరియు ఐటీ రంగాన్ని వేగంగా పరుగులు తీయించేందుకు సీఆర్‌డీఏ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్ల తరహాలోనే అమరావతిలో భారీ క్వాంటమ్ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను, డేటా సెంటర్లను అమరావతికి ఆకర్షించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ప్రపంచస్థాయి సాంకేతిక సంస్థలకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా యువతకు పెద్దపీట వేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi