విశాఖలో ఈడీ సోదాలు – వైఎస్సార్సీపీ నేత నివాసంలో తనిఖీలు
విశాఖలో ఈడీ సోదాలు – వైఎస్సార్సీపీ నేత నివాసంలో తనిఖీలు
విశాఖలో ఈడీ సోదాలు – వైఎస్సార్సీపీ నేత నివాసంలో తనిఖీలు


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)

వెల్ఫేర్ గ్రూప్ ఆర్థిక అవకతవకలు మరియు అక్రమాల కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ఉదయం నుంచే విశాఖపట్నంలో విస్తృత సోదాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ నివాసాలు మరియు కార్యాలయాలలో ఈ తనిఖీలు నిర్వహించారు.

గతంలో వెల్ఫేర్ గ్రూప్ ద్వారా సాగించిన ఆర్థిక లావాదేవీలలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కేంద్ర బృందాలు ఈ సోదాలను ముమ్మరం చేశాయి. కీలకమైన ఆర్థిక పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

సోదాల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా విజయప్రసాద్ నివాసం వద్ద కేంద్ర బందోబస్తు దళాలు మరియు స్థానిక పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande