విశాఖలో లోకేశ్ పర్యటన – ఐబీఎం సెంటర్ ప్రారంభం, సింధు అకాడమీ శంకుస్థాపన
విశాఖలో లోకేశ్ పర్యటన – ఐబీఎం సెంటర్ ప్రారంభం, సింధు అకాడమీ శంకుస్థాపన
Lokesh


విశాఖపట్నం, 05 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర ఐటీ, క్రీడా శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆరిలోవ ప్రాంతంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బ్యాడ్మింటన్ అకాడమీకి ఆయన భూమిపూజ చేశారు. ఉత్తరాంధ్ర క్రీడాకారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని తెలిపారు.

అనంతరం విశాఖలోని ఇసుకతోట ప్రాంతంలో గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) ఏర్పాటు చేసిన 'ఫ్యూచర్‌నౌ సెంటర్'ను మంత్రి అధికారికంగా ప్రారంభించారు. విశాఖపట్నాన్ని క్రీడలు మరియు ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

ఈ నూతన సెంటర్ ప్రారంభంతో విశాఖ స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక అవకాశాలు మరియు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ఉత్తరాంధ్ర ఐటీ రంగానికి ఇది కొత్త ఊపిరి పోస్తుందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande