
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) మణికొండ బీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల రూపా రెడ్డి ఇంటి వద్ద పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. చిన్నచితక వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ ఆరోపించారు. తిరుమల హిల్స్లోని రూపారెడ్డి నివాసానికి బాధితులు చేరుకున్నారు. నైన్ స్టార్ హిల్స్ వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దాచుకున్న జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడి పెట్టమంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు, సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా ఎందుకు తిరిగి ఇవ్వలేదని ప్రశ్నించారు.
తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమని బాధితులు స్పష్టం చేశారు. వందల సంఖ్యలో జనాలను నమ్మించి కోట్లు కొల్లగొట్టారని రూపారెడ్డిపై ఆరోపించారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. బాధితుల ఆందోళనతో మణికొండ తిరుమల హిల్స్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్