
అల్లూరి సీతారామరాజు, 05 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మరింత విభిన్నంగా, లాభదాయకంగా మార్చేందుకు ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాలోని అనుకూలమైన శీతోష్ణస్థితిని ఉపయోగించుకుని 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు.
సాధారణంగా కాశ్మీర్ వంటి చల్లని ప్రాంతాలకే పరిమితమైన కుంకుమపువ్వును మన్యం ఏజెన్సీ ప్రాంతంలోని అనుకూలమైన వాతావరణంలో పండించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో సాగు విస్తీర్ణాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందించనుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలుగా ఇటువంటి వాణిజ్య పంటలు గిరిజన రైతులకు ఎంతో తోడ్పడతాయని విశ్లేషిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi