తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
తిరుమల


తిరుమల, 05 ఆగస్టు (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు బారులు తీరాయి. దీంతో దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande