
మార్కాపురం, 05 ఆగస్టు (హి.స.)మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు ఎస్జీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న టెట్ (TET) పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఈ రోజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పరీక్షలు పూర్తిస్థాయి పారదర్శకతతో, నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV