దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురంలో దొంగతనాల నియంత్రణపై మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సాంకేతికతతో ఫోన్ల రికవరీ.
ఎస్పీ హర్షవర్ధన్ రాజు


మార్కాపూర్, 05 ఆగస్టు (హి.స.) : మార్కాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న దొంగతనాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ద్విచక్ర వాహనాల దొంగలను గుర్తించామని, గుంటూరులో ఒక దొంగిలించిన ద్విచక్ర వాహనం ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోందన్నారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా బ్యాగుల చోరీలు, పిక్పాకెటింగ్ వంటి ఘటనలకు పాల్పడే నిందితులను సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుందన్నారు.

ఇటీవల ఎర్రగొండపాలెం ప్రాంతంలో 60 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతిరోజూ పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని, దీంతో దొంగతనాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయని ఎస్పీ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande