రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో 'ఆరోగ్య తనిఖీ' కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో 'ఆరోగ్య తనిఖీ' కార్యక్రమం
ap


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), ఏరియా ఆసుపత్రులలో ఉచిత 'ఆరోగ్య తనిఖీ' ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు (డెంగ్యూ, మలేరియా) ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మరియు గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహార మందులను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.ఈ రోజు ఉదయం నుంచే గ్రామ సచివాలయాల పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన అన్ని రకాల మందులు, ల్యాబ్ పరీక్షల కిట్లను సిద్ధంగా ఉంచాలని, వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ఉదయం ఆదేశాలు జారీ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande