ప్రమాద మరణాల తగ్గింపే లక్ష్యం.. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
ప్రమాద మరణాల తగ్గింపే లక్ష్యం.. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
Sp


ఆదిలాబాద్, 07 ఆగస్టు (హి.స.)

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని

మరింత తగ్గించడమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నట్లు అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసు హెడ్క్వర్టర్స్లో పోలీసు, వైద్య, ఆర్టీఓ, ఫైర్, ఎన్హెచ్ఐఐ,108 అత్యవసర సేవల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గోల్డెన్ అవర్ లో వేగంగా స్పందించి సరైన ప్రథమ చికిత్స అందిస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. డయల్-112, బ్లూ కోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్ సిబ్బందికి సీపీఆర్తో పాటు అత్యవసర సహాయక చర్యలపై ఇప్పటికే శిక్షణ అందించినట్లు తెలిపారు.సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సంజీవని ద్వారా మరింత ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.గత ఆరు నెలల్లో జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 25 శాతం తగ్గడం సంతోషకరమని పేర్కొంటూ,ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు కిషన్ సింగ్, నూర్ కేతర్బాల్, అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. ప్రణయ్ కుమార్, వైద్యశాఖ, ఆర్టీఓ, ఫైర్, ఎన్హెచ్పీ, 108 అత్యవసర సేవలు, బ్లూ కోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande