ఈ నెల 16న ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి రాక.. మంత్రి సీతక్క
ఈ నెల 16న ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి రాక.. మంత్రి సీతక్క
Seethaka


ములుగు, 07 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లాలో పర్యటించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హమ్ రోడ్ల పనుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. జిల్లాలో చేపద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలలను ఆదేశించారు. ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా మంత్రి సీతక్క శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి మంత్రి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకొని, అనంతరం ములుగు చేరుకొని పైలాన్ ప్రారంభించడమే కాకుండా ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని వర్చువల్ గా, నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.

జిల్లాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనుల వివరాల జాబితాను అన్ని శాఖల అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ నెల 12న వెల్లడించడం జరుగుతుందని, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో రహదారులు ఆక్రమించిన వ్యాపారాలు చేస్తున్న వారికి జరిమానా విధించాలని, వ్యాపారాలు ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande