విశాఖపట్నం పోర్ట్ ఆధునీకరణ పనులకు శ్రీకారం
విశాఖపట్నం పోర్ట్ ఆధునీకరణ పనులకు శ్రీకారం
Port


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ రోజు ఉదయం ఒక కొత్త ఆధునీకరణ ప్రాజెక్టును ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, పోర్ట్ పరిసరాల్లో కాలుష్యాన్ని తగ్గించేలా అత్యాధునిక మెకనైజ్డ్ బెర్త్‌ల నిర్మాణానికి ఈ ఉదయం అధికారులు భూమిపూజ చేశారు.ఈ కొత్త టెక్నాలజీ ద్వారా బొగ్గు, ఇతర ఖనిజాల రవాణా సమయంలో నగరంలోకి దుమ్ము చేరకుండా పూర్తిగా ఆటోమేటెడ్ క్లోజ్డ్ కన్వేయర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల పోర్ట్ సామర్థ్యం పెరగడమే కాకుండా, విశాఖ నగర ప్రజలకు కాలుష్య సమస్యల నుండి శాశ్వత విముక్తి లభిస్తుందని నౌకాయాన రంగ నిపుణులు ఈ ఉదయం మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande