నెల్లూరులోని తోటలచెరువుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
నెల్లూరులోని తోటలచెరువుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
missing


వరికుంటపాడు, 09 ఆగస్టు (హి.స.)

వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి పగడాల రవి 20 రోజులు క్రితం అదృశ్యమయ్యారు. రవి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మణిపూర్‌ రాష్ట్రం టెంగ్నౌపాల్‌ జిల్లాలో సఫాయివాలాగా పగడాల రవి పనిచేస్తున్నారు. సెలవుపై ఇంటికి వస్తూ మార్గం మధ్యలో రవి అదృశ్యమయ్యారు. నాగాలాండ్ ధీమాపూర్ స్టేషన్‌ నుంచి జులై 19న భార్య వరలక్ష్మితో రవి చివరిసారిగా మాట్లాడారు. ఒడిశాలోని భద్రక్ వరకు పనిచేసినట్లు పగడాల రవి ఫోన్‌ సిగ్నల్ చూపిస్తున్నాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో రవి ఐడీ కార్డు, ఇతర పత్రాలు లభ్యమయ్యాయి. ఆర్మీ ఉద్యోగి పగడాల రవి అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande