ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమురం భీం.. కల్వకుర్తి ఎమ్మెల్యే
ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమురం భీం.. కల్వకుర్తి ఎమ్మెల్యే
MLA


నాగర్ కర్నూల్, 09 ఆగస్టు (హి.స.)

ఆదివాసీల హక్కుల కోసం పోరాటం

చేసిన మహనీయుడు కొమరం భీమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్, వ్యవసాయ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరుడు కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం, త్యాగం మనందరికీ ఆదర్శమన్నారు. 'జల్, జంగల్, జమీన్' కోసం ఆయన చేసిన ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు పిలుపునిస్తూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో, ప్రజాసేవలో యువత మరింత చురుకుగా ముందుకు రావాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande