పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు
పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు
pasupu


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కుదిరిన గిరిజన సంక్షేమ శాఖ కీలక ఒప్పందాల వల్ల పసుపు పండించే గిరిజన రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో పండించే నాణ్యమైన పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.రైతులు తాము పండించిన పసుపును తక్కువ ధరకే దళారులకు అమ్ముకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ల ద్వారా పసుపును కేవలం ముడి సరుకుగా కాకుండా, పాలిషింగ్, గ్రేడింగ్ మరియు పౌడర్ రూపంలోకి మార్చి వాల్యూ ఎడిషన్ (Value Addition) చేస్తారు.దీనివల్ల గిరిజన రైతులకు మార్కెట్‌లో సాధారణ ధర కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది.పసుపు రైతుల కోసం అధునాతన డ్రైయింగ్ యార్డులు, అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ (శీతల ఉిడ్డంగి) సౌకర్యాలు మరియు నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లను స్థానికంగానే నిర్మిస్తారు.గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) భాగస్వామ్యంతో ఈ యూనిట్లను నిర్వహించడం ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.ప్రభుత్వం కుదుర్చుకున్న కొత్త మార్కెటింగ్ ఒప్పందాల ద్వారా ఈ ప్రాసెస్ చేసిన పసుపును నేరుగా ప్రముఖ రిటైల్ సంస్థలకు మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande