
అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
వెలగపూడి సచివాలయంలో రెండోరోజు జరిగిన సదస్సులో కలెక్టర్ల సెల్ఫోన్లను హాలు బయటే కలెక్టు చేశారు. ల్యాప్టాప్కు మాత్రమే అనుమతి ఇచ్చారు.
అవి కూడా సదస్సులో సీఎం చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను నోట్సుగా ఫీడ్ చేసుకోడానికి మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్లు ఎవరైనా సమావేశంలోకి సెల్ఫోన్లు తీసుకువస్తే వాటిని బయటకు పంపేయాలని చెప్పారు. గురువారం నాటి సదస్సులో చాలామంది కలెక్టర్లు మొబైల్ ఫోన్లు వాడుతూ బిజీగా కనిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ