శరన్నవరాత్రి ఉత్సవాలకు లడ్డూ ప్రసాదం యంత్రాలు ఏర్పాటు
త్వరలో జరిగే కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం యంత్రాలు ఏర్పాటు చేయబోతున్నారు.
Vijayawada temple


అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)

త్వరలో జరిగే కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం యంత్రాలు ఏర్పాటు చేయబోతున్నారు.

కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు వివిధ సంస్థలతో సంప్రదించి యంత్రాలను ఖరారు చేశారు. రూ.100 విలువైన లడ్డూ పెట్టెలు 400 వరకు ఒక్కో యంత్రంలో పెట్టవచ్చు.

యంత్రంపై ఉండే టచ్ స్క్రీన్పై కావాల్సిన బాక్సుల సంఖ్యను నమోదు చేయాలి. నగదు చెల్లించేందుకు యూపీఐ ఆప్షన్ ఎంచుకుంటే.. క్యూఆర్ కోడ్ వస్తుంది. దానిని మొబైల్తో స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలి. అనంతరం యంత్రం కంపార్ట్లోకి వచ్చే ప్రసాదం బాక్సులు తీసుకోవాలి. ఈ యంత్రాలను రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాలు, ఆలయంలోని క్యూలైన్ల సమీపంలో అందుబాటులో ఉంచనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande