చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం
చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం
చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం


జలదంకి: 12 సెప్టెంబర్ (హి.స.)

చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని ఆదిరెడ్డిపాలెం శివారు పొలాల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై వీరేంద్రబాబు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు బుచ్చి మండలం దామరమడుగు గ్రామానికి చెందిన మల్లిక శ్రీను(41)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande