
రౌతులపూడి:, 12 సెప్టెంబర్ (హి.స.)
శంఖవరం మండలం అవెల్తి పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో ఉప ప్రణాళికా మన్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రౌతులపూడి అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్యామ్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అవెల్తి గ్రామంలో పెద్ద పులి దాడిలో మృతి చెందిన, గాయపడిన ఆవులను అధికారులు పరిశీలించారు. అవెల్తి శివారులో రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్టు యంత్రాంగం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ